Fwd: made by CHOCOLATES, to all choclate lovers

img19/1453/c65va.jpg

కదిలిపొయే కెరటంలా,
సాగిపొయే నావ లాంటి నా జీవితం లొ....
ఆశల హరివిల్లు పూయిస్తూ ఆప్యాయంగా
పలకరించిన మిత్రమా!
అరుణొదయ సంద్య లొగిలిలొ...
సుఖదు:ఖాల జీవిత సంగమం లో
చివరకు మిగిలేది మిత్రులే .....!
మరో సూర్యుడు నాకోసం ఉదయిస్తే
నేను మరో జన్మలొ మనిషి గా జన్మిస్తే
నీలాంటి స్నేహితురాలి మమతానురాగాలు కోసం
ఎన్నిసార్లు అస్తమించడానికైనా నేను సిద్దమే .....!

పున్నమి రోజు చంద్రుని చూడు
ఆ వెన్నెలలో నేనుంటా...
వేసవి రోజు సూర్యుని చూడు
ఆ వెలుతురులో నేనుంటా.....
వర్షపు రోజు వానను చూడు
ఆ చినుకులో నేనుంటా.......
చల్లని రోజు చలిని చూడు
ఆ మంచులో నేనుంటా.......
నీ కలలలో పరిశీలనగా చూడు
ఆ కలలో నేనుంటా......
నీ హృదయాన్ని తట్టి చూడు
ఆ హృదయంలో నేనుంటా............
ఇదంతా కాదు కాని నా స్నేహితుల హృదయాలలో నేను ఉంటా..........

అప్పుడప్పుడు ఎలావున్నావంటూ
ఒక్కపలకరింపు చాలు
నేను గుర్తొచ్చినప్పుడల్లా
నీ పెదాలపై నవ్వులు పూస్తే చాలు
సంతోషమైనా,బాధయినా
నేనుంటే బాగుండుననిపిస్తే చాలు
మన మధ్యనున్న వేల జ్ఞాపకాలు
కొన్నయినా మధురం గా అనిపిస్తే చాలు
చాలు....నా స్నేహానికిది చాలు

మనిషి కీ,మనిషికీ
మనసుకు,మనసుకూ మధ్య
ఈ మాత్రం వారధి చాలు

మనకు ఎందరో పరిచయం అవుతుంటారు
అందులో కొందరే మంచి స్నేహితులవుతారు
మనతో మంచి చెడు పంచుకుంటూ
మంచి స్నేహితులు దొరకడం ఒక అదృష్టం కూడా

1."ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే పారిపోయేవారు అనామకులు గానే మిగిలిపోతారు"...

2.'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...

3."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది. నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి"...

4."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End..'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"...

5."నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వారికీ నచ్చలేదన్నమాట"...

6."ఓడిపోయేవారు ఒక్కసారే ఓడిపోతారు.గెలిచేవారు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతారు.వందసార్లు ప్రయత్నిస్తారు కాబట్టి"...

7."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు...



Raaga Top Ten

 

tajmahal

Half Moon Pose